Accident – ఒకే బైక్ పై నలుగురు .. మృత్యు కాటుకు ఇద్దరు బలి

కొత్తగూడెం, ఏప్రిల్ 24(ఆంధ్రప్రభ): తల్లిదండ్రుల పెళ్లిరోజునే ఆ ఇంట్లో మృత్యువుతాండవం చేస్తుందని వారు గమనించలేకపోయిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే మండలంలోని పోగులపల్లి గ్రామానికి చెందిన గువ్వ దొరబాబు-కవిత ల కుమారుడు గువ్వ ప్రేమ్ అలాగే అదే గ్రామానికి చెందిన జూల యాక సాయిలు-ఉమా ల కుమారుడు జుల కార్తీక్ తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం జరపాలని దుర్గారం (లక్ష్మీపురం) గ్రామానికి చెందిన తమ బంధువులైన జంగ నవ్య 16 సం,రాలు, (ఇంటర్ మొదటి సంవత్సరం), జంగ మౌనిక 17 సం,, రాలు, ఇంటర్ (ద్వితీయ సంవత్సరము) అనుకోని…. నవ్య, మౌనిక, కార్తీక్, ప్రేమ్ లు బుధవారం రాత్రి ఒకే బండి పై ఈ నలుగురు వస్తున్న క్రమంలో పెగడపల్లి, కొత్తపల్లి మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న ట్రాలీకి బలంగా ఢీకొనడంతో నవ్య, మౌనికలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

వారితోపాటు జూల కార్తీక్, గువ్వా ప్రేమ్ అపస్మారక స్థితిలో ఉండటంతో చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. గువ్వా ప్రేమ్ చికిత్స పొందుతూ గురువారం రోజున తెల్లవారుజామున మృతి చెందాడు. జూల కార్తీక్ చికిత్స పొందుతున్నట్లు సమాచారం. నవ్య,మౌనిక, ప్రేమ్ మరణించడంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల తల్లిదండ్రుల పిర్యాదు మేరకు సంబంధిత బాధితుని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ కుశకుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *