మరిపెడ, జులై 4(ఆంధ్రప్రభ): రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనగా మంటలు చెలరేగి ముగ్గురు సహజీవనమయ్యారు. ఈ హృదయ విదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజి సమీపంలోని కుడియాతాండ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఖమ్మం వరంగల్ 563 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నుంచి రొయ్యల మేత లోడుతో ఓ లారి గుజరాత్ రాష్ట్రానికి వయా మరిపెడ మీదుగా వెళుతున్నారు. ఇదే క్రమంలో కరీంనగర్ నుంచి ఓ గ్రానైట్ లారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖపట్నం వైపుగా మరిపెడ మీదుగా వెళుతుంది.
ఈ నేపథ్యంలో గుజరాత్ కు వెళుతున్న లారీ జాతీయ రహదారిపై ఉన్న గుంతను తప్పించబోయి ఎదురుగా వస్తున్న గ్రానైట్ లారీని బలంగా ఢీకొట్టింది. రెండు లారీలు ఎదురెదురుగా బలంగా ఢీ కొట్టిన ఈ ఘటనలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో రాజస్థాన్ రాష్ట్రానికి వెళుతున్న లారీ క్యాబిన్లో ఉన్న డ్రైవర్ సర్వర్ రామ్ (23), క్లీనర్ బర్కత్ ఖాన్ (23), అదేవిధంగా గ్రానైట్ లారీ క్యాబిన్లోని మరో డ్రైవర్ గూగులోత్ గణేష్ (30) మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయారు. రాజస్థాన్ లారీలో వెళుతున్న డ్రైవర్, క్లీనర్ రాజస్థాన్ రాష్ట్రం జోద్ పూర్ కు చెందినవారీగా గుర్తించారు.సంఘటన స్థలానికి మరిపెడ సీఐ రాజకుమార్, ఎస్సైలు సతీష్, సంతోష్ లు సిబ్బందితో చేరుకుని ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను అర్పించారు. క్యాబిన్లలో ఇరుక్కొని సజీవదాహరణమైన డ్రైవర్ల శవాలకు ఘటన స్థలంలోని పంచనామ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.