Accident | అతివేగమే కొంపముంచింది..

Accident | అతివేగమే కొంపముంచింది..

Accident | జైనథ్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తరోడ వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Serious road accident)లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. 44 నంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్‌కు తిరిగి వస్తుండగా జైనథ్ మండలం తరోడ వద్ద అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది.

ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్(Adilabad) పట్టణం జై జవాన్ నగర్ కు చెందిన షేక్ మొయినుద్దీన్ (31), మోయిన్ (28), కీర్తి సాగర్ (30) మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో యోగేష్ తీవ్ర గాయాలతో ఆదిలాబాద్ లో చికిత్స పొందుతున్నారు. జైనథ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

CLICK HERE TO READ కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం

CLICK HERE TO READ

Leave a Reply