నేషనల్ హైవే పై ప్రమాదం..

నేషనల్ హైవే పై ప్రమాదం..

ఉయ్యురు, ఆంధ్రప్రభ : ఉయ్యూరు – మచిలీపట్నం నేషనల్ హైవే పై జియో పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం ఉదయం కారు ప్రమాదం జరిగింది. కారులో సుమారు ఏడుగురు ఉన్నట్టు సమాచారం. సంఘటనా స్థలంలో ఒక వ్యక్తి మృతి చెందగా, ఇద్దరికీ ప్రమాదకర పరిస్థితి ఉందని స్థానికులు తెలిపారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు కానూరు గ్రామానికి చెందిన వాస్తవ్యులు అని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply