ఇబ్రహీంపట్నం రూరల్, జులై 18(ఆంధ్రప్రభ): ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ పై ఆగి ఉన్న లారీ (Lorry)ని వేగంగా వస్తున్న కారు (car) వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తుల్లో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడగా (Four people spot died), మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
ఈ విషాద ఘటన ఆదిభట్ల (Adibhatla) పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ ఎగ్జిట్ 12 సమీపంలో ఇవాళ తెల్లవారు జామున 3.30 ప్రాంతంలో చోటు చేకుంది. మృతులు మొయినాబాద్ (Moinabad) లోని గ్రీన్ వ్యాలి రిసార్ట్ లో పనిచేస్తున్నట్లు తెలిసింది.యాదాద్రి వెళ్లి తిరుగు ప్రయాణంలో విషాదం చోటుచేసుకుంది. మృతులు మహబూబ్ నగర్ కు చెందిన చందులాల్ (29) డ్రైవర్, గుగులోతు జనార్దన్ (50),మొయినాబాద్ కు చెందిన బాలరాజు (40), శ్రీకాకుళం చెందిన భాస్కర్ రావులుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని నగరంలోని ప్రైవేట్ అస్పటల్ కు తరలించారు. మృతదేహలను ఇబ్రహీంపట్నం ప్రభుత్వ అస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదం పై ఆదిభట్ల పోలీసులు అరతీస్తున్నారు.