గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ప్రమాదంపై గుడిహత్నూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రమాదం జరిగిందిలా…
హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతి వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు గుడిహత్నూర్ సమీపాన అదుపు తప్పింది. ఈ క్రమంలో రోడ్డు పక్కనేఉన్న రేలింగ్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాద సమయంలో సుమారు 30 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. అందులో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్సుల్లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.