Majeru | గ్రామ పెద్దల సహకారంతో తప్పిన ప్రమాదం

Majeru | చల్లపల్లి, ఆంధ్రప్రభ ; చల్లపల్లి మండల పరిధిలోని కొత్త మాజేరు వద్ద గుండేరుపై ఉన్న వంతెనకు ఓపక్క మలుపు వద్ద మట్టి కరిగి జారిపోవడంతో ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. మలుపు తిరిగే సమయంలో పలువురు వాహనదారులు ద్విచక్ర వాహనదారులు వెళ్లాల్సిన పరిస్థితి. కొందరైతే పక్కకు జారీ తృటలో ప్రమాదం నుంచి తప్పించుకుని ఊపిరి పీల్చుకున్న సంఘటనలు కూడా లేకపోలేదు. ఎంతకీ అధికారులు ముందుకు రాకపోవడంతో గ్రామ పెద్దలు గొట్టిపాటి వెంకట్రావు, కల్లేపల్లి లక్ష్మీనారాయణ, బొర్రా అగ్గిరాముడు, తుమ్మలగుంట గోపాలకృష్ణలు గ్రామంలో నిరుపయోగంగా ఉన్న సిమెంట్ దిమ్మలను తెప్పించి గుంటపడిన ప్రాంతంలో వేయించారు.

దీంతో ప్రమాదకరంగా ఉన్న ఆ ప్రాంతంలో రాకపోకలు సాగించాలంటే భయాందోళనకు గురవుతున్నామని సిమెంటు దిమ్మలు వేయడంతో ఊపిరి పీల్చుకున్నామని ఆ మార్గంలో రాకపోకలు సాగించే పలువురు హర్షం వ్యక్తం చేశారు. బిక్కుబిక్కుమంటు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆర్ అండ్ బి అధికారులు ప్రమాదకరంగా ఉన్న ఈ ప్రాంతంలో రాళ్లు వేసి సరి చేస్తామని చెప్పుకొస్తున్నారు తప్ప ఇప్పటివరకు ఆచరణకు పూనుకోలేదు. దీంతో గ్రామ పెద్దలే ముందుకు వచ్చి సమస్య పరిష్కార దిశగా అడుగులు వేసి పరిష్కరించారు.

Leave a Reply