Accident | రోడ్డు ప్రమాదం…ఇద్దరు మృతి

Accident | మధ్యప్రదేశ్, ఆంధ్రప్రభ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంతో మహబూబ్ నగర్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మద్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది. ఉజ్జయిని పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తుండగా తుఫాన్ ను ట్రక్కు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో మహబూబ్ నగర్ సీసీ కుంట మండలం ఫర్దిపూర్ కు చెందిన ఇద్దరు యువకులు నర్సింహా (28), శివ (26) మృతిచెందగా, మరో 9 మందికి గాయాలయ్యాయి. బాధితులంతా ఫర్దిపూర్ గ్రామస్థులే అని అధికారులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
