Accident | రోడ్డు ప్రమాదం..

Accident | చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : చిలకలూరిపేట మండలం తాతపూడి హైవే ఫ్లైఓవర్ పైన ఇద్దరు స్వాములు నడుచుకుంటూ వెళుతుండగా వాహనం ఢీ కొట్టడంతో ఇద్దరు స్వాములకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరిద్దరూ పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు నుంచి తిరుపతి కాలినడకన వెళుతున్నారు. ఈ సంఘటనలో సతీష్ అనే స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొక స్వామి పేరు ప్రసాద్. ఇతనికి కాలు, చెయ్యి ఫ్రాక్చర్స్ అయ్యాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే చిలకలూరిపేట 108 అంబులెన్స్ సిబ్బంది EMT శోభన్ బాబు, పైలట్ శివ నాగాంజనేయులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స చేసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

Leave a Reply