కారు ఢీకొని వృద్ధుడు దుర్మరణం

కారు ఢీకొని వృద్ధుడు దుర్మరణం

కమ్మర్ పల్లి,ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై కారు ఢీకొని వృద్ధుడు దుర్మరణం చెందినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ జి. అనిల్ రెడ్డి తెలిపారు. ఎస్ఐ జి. అనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన ఎర్రోళ్ల లస్మయ్య ( 75 ) టీవీఎస్ ఎక్సల్ పై తన నివాసమైన కేసీఆర్ కాలనీకి తిరిగి వస్తుండగా మోర్తాడ్ వైపు నుండి కమ్మర్ పల్లి వైపు వస్తున్న టాటా టిగోరు కారు ఢీకొట్టిందనీ తెలిపారు.

అతివేగంగా,అజాగ్రత్తగా కారు నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో లస్మయ్య కు తీవ్ర గాయాలయి ఆక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.మృతుడి కూతురు ఎర్రోళ్ల వసంత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.

Leave a Reply