ఇంజన్ లో మంటలతో పూర్తిగా దగ్ధం
చిట్యాల మండలం గుండ్రంపల్లి జాతీయ రహదారి యూటర్న్ వద్ద రోడ్డు ప్రమాదం
సురక్షితంగా బయటపడ్డ ఎనిమిది మంది..
వారి ప్రాణాలు అడ్డువేసి 8 మంది ప్రయాణికులను కాపాడిన లారీ డ్రైవర్లు
ఎనిమిది మంది ప్రయాణికుల ను కాపాడి తీవ్రంగా గాయపడిన ఇద్దరు
అయ్యప్ప స్వామి భక్తులు ..
చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాఒపల్లి వద్ద శనివారం నాడు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఇన్నోవా కారు పూర్తిగా దగ్ధమై కాలిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ కారులో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాదు నుంచి విజయవాడకు బయలుదేరిన ఇన్నోవా కారు తెల్లవారుజామున గుండ్రా ఒపల్లి వద్ద డివైడర్ను ఢీ కొట్టి బోల్తా కొట్టి హైదరాబాద్ – విజయవాడ వైపు వెళ్లే రోడ్డుపై పడి భారీగా అగ్నిప్రమాదం చేస్తుంది. కారులో 8 మంది ఉండగా హైవేపై వస్తున్న లారీలు పక్కన ఆపి ముగ్గురు రామకృష్ణ, అశోక్, షరీఫ్ లు ఇన్నోవా కార్ డోర్లు తీసి బయట తీసి కాపాడారు. ఇందులో ఒకరు అయ్యప్ప మాల ధరించి ఉన్నాడు. తోటి వారి ప్రాణాలు కాపాడమని అయ్యప్పమాలలో ఉండి వారిని కాపాడి దైవంగా నిలిచాడు నిలిచాడు. వీరికి తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు చేతులు కాలుతున్న లెక్కచేయకుండా 8 మంది ప్రాణాలు కాపాడడంతో రియల్ హీరోలుగా నిలిచారు. వీరిని చౌటుప్పల్ హాస్పిటల్ నుండి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు..


