ACB raids | చేజర్ల గ్రామంలో ఏసీబీ సోదాలు…

ACB raids | చేజర్ల గ్రామంలో ఏసీబీ సోదాలు…
- ఏసీబీ అధికారుల సోదాల్లో పట్టుబడ్డ నక్కబోయిన నాగేంద్రబాబు.
ACB raids | నకరికల్లు, (పల్నాడు జిల్లా) ఆంధ్రప్రభ : చేజర్ల గ్రామానికి చెందిన గుండాల యోహాన్ అనే రైతు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరగా అందుకు రూ.70,000 లంచం డిమాండ్ చేయటంతో ఎనర్జీ అసిస్టెంట్ అయినా నాగేంద్రబాబు తండ్రి ద్వారా ఎనర్జీ అసిస్టెంట్ లావాదేవీలు నడిపించారు.
నాగేంద్ర బాబు వ్యవహార శైలి డబ్బుల డిమాండ్ తో విసిగి వేసారిన యోహాన్ విజయవాడ ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈరోజు ఏసీబీ అధికారులు కాపుకాసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మాత్రే, ముగ్గురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
