కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ లో రెండవ రోజు ఏసీబీ తనిఖీలు…

కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ లో రెండవ రోజు ఏసీబీ తనిఖీలు…
విజయవాడ కార్పొరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో రెండో రోజు ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. మంగళ వారం,బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ లో ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు.మంగళవారం చేసిన పైల్స్ తనిఖీల లో స్వాధీనం చేసుకున్న రికార్డులను నేడు క్షుణ్ణంగా పరిశీలించారు.
సర్కిల్ – 2, పరిధిలోని సత్యనారాయణ పురం, సింగ్ నగర్, నందమూరు నగర్ పాయక పురాం,సర్కిల్ – 3 ,పరిధిలో పటమట ప్రాంతం లో కొన్ని బిల్డింగ్ లను వెరిఫికేషన్ చేయడంతో పాటు కొన్ని ఫిర్యాదులు, అనధికార కట్టడాలు గుర్తించి,ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా లోతైన విచారణ సాగుతుందనీ, మంగళ వారం రాత్రి రెండు గంటలకు వరకు రికార్డులు పరిశీలించడం జరిగిందని బుధ వారం రాత్రి వరకు కూడా టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో తనిఖీలు నిర్వహిస్తున్నాం అని ఏసీబీ అధికారి సుబ్బారావు తెలిపారు
