నంద్యాల బ్యూరో, జులై 31 ఆంధ్రప్రభ : రెవెన్యూ శాఖ Revenue Department లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ (Senior Assistant) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వైనం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా (Nandyal District) ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ (Atmakur Revenue Division) కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్.రమేష్ (R.Ramesh) అనే వ్యక్తి పొలం విషయం లో రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న జూపాడుబంగ్లా (Jupadu Bungalow) కు చెందిన ఈశ్వరయ్య అనే రైతు వద్ద నుండి 40వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడని రైతు ఈశ్వరయ్య కర్నూలు జిల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించి, వారికి వివరాలను అందించారు.
ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఆర్.రమేష్ లంచం డబ్బులు తీసుకోవటానికి జూపాడుబంగ్లాకు వెళ్ళి రైతు ఈశ్వరయ్య వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సోమన్న, సిఐ కృష్ణయ్య, ఎస్ఐ సుబ్బారాయుడు, సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్ ఆర్.రమేష్ ను విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు.
ఏసీబీ దాడుల్లో డీఎస్పీ సోమన్నతో పాటు సిఐ కృష్ణయ్య, ఎస్ఐ సుబ్బారాయుడు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. రమేష్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్డీవో కార్యాలయంలో తలుపులు మూసివేసి ఆర్డీఓను, ఉద్యోగులను అధికారులు ప్రశ్నించారు.
జిల్లాలో ఇటీవల కాలంలో ఏసీబీ దాడులు అధికమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చే తమ జీతంతో సరిపుచ్చుకోక అత్యాశతో, అవినీతికి పాల్పడి, లంచాలకు అలవాటు పడితే ఎవరైనా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. ఫిర్యాదుదారులకు ఎటువంటి ఇబ్బంది కలగనీయమని తెలిపారు.
పలు ప్రభుత్వ శాఖలతో బాటు, విద్యుత్, రెవెన్యూ, విద్యాశాఖ ఇంకా పంచాయతీ రాజ్, మున్సిపల్, వైద్య-ఆరోగ్య శాఖ, జిల్లా రిజిస్టర్ కార్యాలయం సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోయిందని, అవినీతి నిరోధక శాఖ అధికారులు గట్టి నిఘా పెట్టి అవినీతి అధికారులను, లంచాల కోసం ప్రజలను పీడించే వారిని తగిన విధంగా శిక్షించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.