ACB attack | ఏసీబీ వలలో.. డిప్యూటీ త‌హ‌సీల్దార్ చంద్రశేఖర్

ACB attack | ఏసీబీ వలలో.. డిప్యూటీ త‌హ‌సీల్దార్ చంద్రశేఖర్

ACB attack | నల్గొండ, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా (Nalgonda District) చండూరు డిప్యూటీ తహసీల్దార్ (Deputy Tahsildar) చంద్రశేఖర్ ఏసీబీ అధికారులకు ప‌ట్టుబ‌డ్డారు. గట్టుప్ప‌ల్ మండలం తెరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాధితులు ఒక అక్రమ రిజిస్ట్రేషన్‌పై సమాచార హక్కు చట్టం (RTI) కింద వివరాలు కోరగా, ఆ వివరాలు ఇవ్వడానికి చంద్రశేఖర్ రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

లంచం డిమాండ్‌పై బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో, అధికారులు పన్నిన ఉచ్చులో చంద్రశేఖర్ చిక్కారు. హైదరాబాద్ బాలాపూర్‌లోని తన నివాసంలో డిమాండ్ చేసిన సొమ్ము రూ.15 వేలతో చంద్రశేఖర్ (Chandrasekhar) ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Leave a Reply