ACB | లంచకొండి లక్ష్మణ్..

ACB | లంచకొండి లక్ష్మణ్..
- ఏసీబీ అధికారులకు దొరికాడు
ACB | డోన్ టౌన్, ఆంధ్రప్రభ : డోన్ పట్టణంలోని ఉప ఖజానా కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. డోన్ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారిగా శ్యామ్ రాజు ఈ ఏడాది జూన్ 30న రిటైర్డ్ అయ్యారు. పెన్షన్ మంజూరు అయ్యింది కానీ బెనిఫిట్స్ కోసం గత ఐదు నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇందుకోసం సీనియర్ అసిస్టెంట్ ఆర్. లక్ష్మణ్ నాయక్ రూ.45వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు రూ.30వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. అనంతరం శ్యామ్ రాజు ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో ఉప ఖజానా కార్యాలయంలో దాడులు నిర్వహించారు. లక్ష్మణ్ నాయక్ రూ.30వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సోదాలలో సీఐ లు కృష్ణయ్య, రాజ ప్రభాకర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

