ACB | మా రైతుల గోస తాకింది

ACB | మా రైతుల గోస తాకింది

  • వెంకటరెడ్డి బాధితుల సంబరాలు
  • కలెక్టరేట్ వద్ద పటాకులు కాల్చి గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతుల సంబరాలు


ACB | హనుమకొండ కల్లెక్టరేట్, ఆంధ్రప్రభ : హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఏసీబీకి (ACB) పట్టుబడటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులు సంబరాలు చేసుకున్నారు. కలెక్టరేట్ గేటు వద్ద పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.ఈసందర్భంగా దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ… 1956 గ్రీన్ ఫీల్డ్ హైవే చట్టం ప్రకారం మా భూములు తీసుకున్నారు. కరోనా సమయంలో భూములు తీసుకొని రెట్లు సవరించకుండా.. మాకు డబ్బులు ఇవ్వకుండా.. వెంకటరెడ్డి అడ్డుపడ్డాడు అని ఆరోపించారు.

గతంలో కలెక్టర్ (Collector) గా పనిచేసిన ఆమ్రపాలి ఆరేపల్లి, వంగపహాడ్ గ్రామస్తులకు మార్కెట్ రేటు కంటే రెండు రూపాయలు ఎక్కువే ఇచ్చారన్నారు.కానీ మాకు న్యాయమైన పరిహారం ఇవ్వమని ఇప్పటి కలెక్టర్, రాజకీయ నాయకులు, నేషనల్ హైవే అధికారులు చెప్పినా వెంకటరెడ్డి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశాడని, మా రైతుల గోస తాకి ఏసీబీకి పట్టుబడ్డాడని సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి అవినీతి అధికారులను కటినంగా శిక్షించాలని రైతులు డిమాండ్ చేశారు.

Leave a Reply