srh|షేక్ చేస్తున్న అభిషేక్

srh|షేక్ చేస్తున్న అభిషేక్

18బంతుల్లో హాఫ్ సెంచ‌రీ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఢీకొంటున్నాయి. న్యూ చంఢీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ స్టేడియం లో మ్యాచ్ జ‌రుగుతుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్ట‌న్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. హైద‌రాబాద్ జ‌ట్టు ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్ బ‌రిలో దిగారు… అభిషేక్ శ‌ర్మ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఫోర్లు , సిక్స‌ర్లతో దంచికొడుతున్నాడు. అభిషేక్ శ‌ర్మ 18బంతుల్లో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. 5 ఫోర్లు, 5 సిక్సుల‌తో 53 పరుగ‌లు సాధించాడు. ఆరు ఓవ‌ర్ల‌కు హైద‌రాబాద్ జ‌ట్టు వికెట్లు కోల్పోకుండా 105 ప‌రుగులు చేసింది.

Leave a Reply