బాసర, ఆంధ్రప్రభ : సంపూర్ణ చంద్రగ్రహాన్ని(Full moon planet) పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుండి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి(Goddess of Knowledge, Shri Saraswati) ఆలయంతో పాటు ఉప ఆలయాలను మూసి వేయనున్నట్లు ఆలయ స్థాన చార్యులు ప్రవీణ్ పాటక్(Praveen Pathak), ప్రధాన అర్చకులు సంజు పూజారి ఓ ప్రకటనలో తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆలయంలోని అమ్మవార్లకు ఉప ఆలయాలలో మహా నివేదన, హారతి నిర్వహించి మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం(Monday) తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు జరుపుకొను అభిషేక సేవ(Abhishek Seva)ను రద్దు చేసినట్లు తెలిపారు. గ్రహణ అనంతరం ఆలయంతో పాటు ఉప ఆలయాలను గోదావరి జలాలతో సంప్రోక్షణ చేసి ఉదయం 7.30 నుండి ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయని అర్చకులు, అధికారులు తెలిపారు

