ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు.

ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు.

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు ఏపీజే అబ్దుల్ కలాం(APJ Abdul Kalam) జయంతిని పురస్కరించుకొని ప్రపంచ విద్యార్థి దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి బుచ్చన్న(Bolisetty Buchanna) అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. అబ్దుల్ కలామ్ శాస్త్రవేత్త, రాష్ట్రపతి అయినా నిత్య విద్యార్థిలా ఉండేవాడనీ, వారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు శ్యామల, అంగన్వాడి టీచర్ లక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply