మేడ్చల్, ఆగస్టు 12 (ఆంధ్రప్రభ) : మేడ్చల్ (medchal) మున్సిపల్ పట్టణంలోని జాతీయ రహదారి 44పై రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ లో ప్రమాదంలో లారీ (Lorry) టైర్ల కింద పడి ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం… మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని స్వామి వివేకానంద (Swami Vivekananda) కూడలి వద్ద బైక్ పై వెళ్తున్న గంజికుమార్ (Ganjikumar) లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.
మేడ్చల్ జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ టైర్ల కింద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మృతుడు గంజికుమార్ శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా చెల్లా చెదురయ్యాయని స్థానికులు తెలియజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు (police) వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ ట్రాఫిక్ సిఐ మధుసూదన్ వెల్లడించారు.