వాజేడు, జులై 23 (ఆంధ్రప్రభ) : తోడబుట్టిన తమ్ముడికి బండి ఇవ్వడానికి వెళ్లి కానరాని లోకాలకు చేరిన అన్నయ్య పిడుగుపాటు కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా (Mulugu District) వాజేడు మండల పరిధిలోని పెద్ద గొల్లగూడెం (pedda gollagudem) గ్రామ సమీపంలో సంఘటన జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…. బుధవారం సుమారు 12గంటల సమయంలో పేరూరు గ్రామానికి చెందిన తోటపల్లి వేణు (Thotapalli Venu) (20) ద్విచక్ర వాహనంపై పేరూరు నుండి ఏటూరు నాగారం (Eturu Nagaram) వెళ్తుండగా పెద్ద గొల్లగూడెం గ్రామ శివారులో పిడుగుపాటు గురై అక్కడికక్కడే మృతి చెందారు.
ఇది తెలుసుకున్న బంధువులు ప్రమాదానికి గురైన ఆ యువకుడిని వైద్యశాలకు తరలించారు. అయితే అక్కడి వైద్యులు మహేందర్ అప్పటికే మృతి చెందారని తెలిపారు. దీంతో వాజేడు పోలీసులు ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చేతికి అందిన కొడుకు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

