(ఆంధ్రప్రభ, తిరుపతి ప్రతినిధి) తిరుపతి(Tirupati) రాహుల్ కన్వెన్షన్ సెంటర్ నిర్వహిస్తున్న ‘’మహిళా సాధికారతపై పార్లమెంటు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు ఆదివారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు చేరుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Lok Sabha Speaker Om Birla), రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్(Rajya Sabha Deputy Chairman Harivansh)కు పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు డి. పురందేశ్వరి(Purandeshwari), ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ సి. అయ్యన్నపాత్రుడు(Speaker C. Ayyannapatrudu), ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు(Deputy Speaker Raghurama Krishnam Raju), ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఘనస్వాగతం పలికారు.
రాష్ట్ర మహిళా సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ గౌరు చరితారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్య దేవర, తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, పూతలపట్టు, వెంకటగిరి, నగరి,సూళ్లూరుపేట, , గూడూరు ఎమ్మెల్యేలు. రాప్తాడు,ఆళ్లగడ్డ,కడప జిల్లాల ఎమ్మెల్యేలు,అధికారులు, పాల్గొన్నారు.