42 శాతం రిజర్వేషన్ పై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి

నర్సంపేట, ఆంధ్రప్రభ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలనీ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదకు ఇచ్చిన వినితి పత్రంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టీజేఎస్ నాయకులు శుక్రవారం కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య‌, ఉద్యోగ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలన్నారు.

రిజర్వేషన్లపై అనేక సంవత్సరాలు జరిగిన ఉద్యమాలను గుర్తించి సమగ్ర కులగణ‌న చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిందని, రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లును ఆమోదించకుండా అనేక రోజుల నుండి పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చకుండా, పార్లమెంటులో ఆమోదించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.

దీంతో బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు లేక తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్లోని 9లో రిజర్వేషన్లను చేర్చి బీసీలకు న్యాయం చేయాలి ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్, గుంటి రామచందర్, సోల్తి సాయికుమార్, ఎండి మహబూబ్అలీ, సందాని తరుణ్, శ్రావణ్, ఎలిషాల రాజేష్ పాల్గొన్నారు.

Leave a Reply