Tiger | పెద్దపులి.. అటు నుంచి ఇటు!

- బెల్లంపల్లి అడవులను వీడి వెళ్లిన పెద్దపులి
- తిర్యాణి మంగి అడవుల్లోకి చేరినట్లు అనుమానాలు
Tiger | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : నిన్నటి వరకు బెల్లంపల్లి అటవీ డివిజన్‌లో మకాం వేసిన పెద్దపులి.. ఈ అటవీ ప్రాంతాన్ని వీడి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మంగి అడవుల్లోకి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. సోమావారం బెల్లంపల్లి మండలం చర్లపల్లి అడవుల్లోకి వచ్చిన పెద్దపులి సోమ, మంగళవారం రెండు రోజులపాటు ఇదే అడవిలో ఉండి మంగళవారం సాయంత్రం బెల్లంపల్లి మండలం కన్నాల పెద్దబుగ్గ అటవీ ప్రాంతం మీదుగా తిర్యాణి మండలం లోని ఉల్లిపిట్ట డోర్లి మీదుగా మంగిఅడవుల్లోకి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ విషయం పై బెల్లంపల్లి అటవీరేంజ్ అధికారి పూర్ణచందర్‌ను వివరణ కోరగా.. బెల్లంపల్లి అటవీ రేంజ్ నుంచి త్రిఅని అటవీ ప్రాంతంలోకి పెద్దపులి వెళ్లి ఉంటుందని వివరించారు
