అమ్మతనానికి నిదర్శనం..

అమ్మతనానికి నిదర్శనం..
కొత్తగూడ, ఆంధ్రప్రభ : అమ్మతనానికి నిదర్శనమై చిన్నారిని ఆప్యాయంగా తన ఒడిలో లాలించిన తీరు చూసి మండల ప్రజలు స్టాఫ్ నర్స్ ను అభినందించిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మండలంలోని హనుమాన్ తండకు చెందిన గర్భిణీ తన చిన్నారి బాబుతో ఆరోగ్య పరీక్షల కోసం శిబిరానికి వచ్చింది.
ఆమెతో సహాయం చేసేందుకు ఎవరూ లేకపోవడంతో పరీక్షల సమయంలో ఆ చిన్నారి బాబు ఏడుస్తూ ఉంటే.. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్స్ ప్రీతి స్పందించి తల్లి ప్రేమతో లాలిస్తూ ఓదార్చి అమ్మతనానికి నిదర్శనంగా నిలిచింది. శిబిరానికి వచ్చిన ప్రజలు, వైద్యులు, స్థానిక సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ స్టాఫ్ నర్స్ ప్రీతిని అభినందించారు.
