Accident | ఘోర ప్రమాదం..

Accident | ఘోర ప్రమాదం..


ఎన్టీఆర్ జిల్లా నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ శివారు అనాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Serious road accident) జరిగింది. లారీని వెనుకనుండి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు తుక్కు తుక్కు అవ్వడంతో చంద్రశేఖర్ అనే వ్యక్తి మృతి చెందారు. రన్నింగ్ లో ఉన్న లారీ టైర్ పగలడంతో లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. హైదరాబాద్ లో E.A software TEAM SOLUTIONS అనే సంస్థను చంద్రశేఖర్ నడుపుతున్నారు. విజయవాడలో వివాహానికి వెళుతున్న టైమ్ లో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అవ్వడంతో విజయవాడ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు.

Leave a Reply