కోర్టు ఏర్పాటు కోసం జడ్జీల బృందం పరిశీలన..

భీమ్‌గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లాభీమ్‌గల్ పట్టణంలో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు కోసం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి భవనాలను పరిశీలించారు. ప్రస్తుతం ఎంపీడీవో కార్యాలయం ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండే అనువైన స్థలంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ఎంపీడీవో కార్యాలయం, బస్ డిపో, వివిధ భవనాలను హైకోర్టుకు ప్రపోజల్స్ పంపించి, ఆదేశాలు రాగానే కోర్టు పనులు మొదలవుతాయని పేర్కొన్నారు.మండల ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ తహసిల్దార్ మొహమ్మద్ షబ్బీర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply