MDK | ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర.. కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. బుధవారం శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతిష్టాత్మక మహిమాన్విత ఏడుపాయల దుర్గ భవాని మాతను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబం సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఇంతకు ముందు జిల్లా కలెక్టర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ప్రత్యేక పూజలు అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ… మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లిలో ఉన్న ప్రతిష్టాత్మక మహిమాన్విత ఏడుపాయల జాతర శివరాత్రి మొదలుకొని మూడు రోజులు జరుగుతుందని, ఈ జాతరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్, తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలన్నారు. భక్తులందరూ మూడు రోజులు పాటు జరిగే జాతరలో ప్రశాంతంగా దర్శనాలు, ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా ప్రజలు పాడిపంటలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *