BCCI | సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం…
- లైఫ్ టైమ్ అవార్డుతో బీసీసీఐ సత్కారం
టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించింది. భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గాను సచిన్‌కు CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును అందజేయనున్నారు. శనివారం జరిగే బీసీసీఐ వార్షిక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌ను బీసీసీఐ అవార్డుతో సత్కరించనుంది. సచిన్ అవార్డు ప్రకటనపై మాజీ ఆటగాళ్లు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.