పెనుగంచిప్రోలులో అద్భుతం..

పెనుగంచిప్రోలులో అద్భుతం..
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగంచిప్రోలులో వెలసిన శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో నేడు ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయించే సూర్యుని బంగారు కిరణాలు గర్భాలయంలోని అమ్మవారి మూలవిరాట్ను నేరుగా తాకాయి. శ్రీ చక్ర పూజ సమయంలో ఉదయం 6:30 నుండి 6:45 నిమిషాల మధ్యలో సూర్యకిరణాలు అమ్మవారిని తాకాయి.
సూర్యరశ్మి అమ్మవారి పాదాల నుంచి ముఖారవిందం వరకు నిదానంగా పాకుతూ, అమ్మవారిని దివ్య తేజస్సుతో వెలిగించిన తీరు భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు “అమ్మవారికి సూర్య నారాయణుడి అభిషేకం”గా భావించి, జయజయధ్వానాలు చేశారు. ఇది అత్యంత శుభసూచకమని, ఆలయానికి విశేషమైన శక్తిని ఇస్తుందని పూజారులు అభిప్రాయపడ్డారు.
