చింతూరు ఏజెన్సీలో మృతదేహాల కలకలం

సోకిలేరు వాగు వద్ద రెండు మృతదేహాలు ఉన్నట్లు పుకార్లు
గుర్తుతెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహాన్ని గుర్తించిన పోలీసులు

చింతూరు, (ఏయస్ఆర్ జిల్లా), (ఆంధ్రప్రభ) : అల్లూరి సీతారామ రాజు జిల్లా (Alluri Sitarama Raju District) చింతూరు మన్యంలో మృతదేహాల కలకలం రేగింది. చింతూరు మండలం చదలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని తులసిపాక గ్రామ శివారు ప్రాంతంలోని సోకిలేరు వాగులో గుర్తుతెలియని వ్య‌క్తి మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. తులసిపాక సమీపంలోని సోకిలేరు వాగు వద్ద రెండు మృత దేహాలు ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

విషయం తెలుసుకున్న చింతూరు సర్కిల్ పోలీసులు (Chintur Circle Police) మృతదేహాల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో ఒక కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహాన్ని పరిశీలిస్తే సుమారు పది నుంచి పదిహేను రోజుల క్రితం మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం లభించింది.. చింతూరు ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతం. అయితే, ప‌ర్యాట‌కులు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందారా లేదా హత్య చేసిన త‌ర్వాత మృత దేహాలను ఇక్కడ పడేసారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.

Leave a Reply