ఆరోగ్యవంతమైన సమాజమే అభివృద్ధికి పునాది: ఎమ్మెల్యేలు

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీ కృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీ కృష్ణ మాట్లాడుతూ, “ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా తల్లి-శిశు ఆరోగ్యం, టీకాల కార్యక్రమాలు, పరిశుభ్రత, పోషకాహారం వంటి అంశాలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి” అని తెలిపారు.

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. వ్యాధులను ముందుగానే నివారించేందుకు అవగాహన అత్యంత అవసరమని పేర్కొన్నారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. కె. రవికుమార్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని, ముఖ్యంగా ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో జిల్లా మంచి ఫలితాలు సాధించిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. భారత్ రెడ్డి, ప్రోగ్రామ్ అధికారులు డా. కృష్ణ మోహన్, డా. సురేష్ బాబు, లీగల్ సెల్ అథారిటీ ప్రతినిధులు, ఆర్‌ఎంఓ డా. ఆర్. శంకర్, డా. ప్రశాంత్, డా. రోహిత్, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, వైద్యాధికారులు, పర్యవేక్షణ సిబ్బంది, వైద్య మరియు నర్సింగ్ కళాశాల విద్యార్థులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply