చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లకు ఘన సన్మానం…

చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లకు ఘన సన్మానం…
మేడ్చల్, ఫిబ్రవరి 23(ఆంధ్రప్రభ): మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా ఇవాళ బాధ్యత స్వీకరించిన శ్రీదేవి, వైస్ చైర్ పర్సన్ రజితా రెడ్డి, కౌన్సిలర్లను గౌడవెల్లి మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే మల్లారెడ్డి చిత్తశుద్ధితో నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిందన్నారు. కేసీఆర్, మల్లారెడ్డి చూపిన బాటలో మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పరిరక్షణ కు, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన పాలక వర్గ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, గౌడవెల్లి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గోమారం శ్రీనివాస్ రెడ్డి, అప్పమ్మ గారి రాజగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
