దూడల రాములు గౌడ్ కు ఘన నివాళి

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కు చెందిన సీనియర్ ప్రభుత్వ ఉపాధ్యాయులు దూడల వెంకటేష్ గౌడ్ తండ్రి రాములు గౌడ్ దశదిన సంస్మరణ ఆదివారం జరిగింది. జిల్లా గోపా ప్రధాన కార్యదర్శి బొమ్మ కంటి బాలరాజు గౌడ్, గోపా సభ్యులు పోతుగంటి సంపత్ గౌడ్ హాజరై రాములు గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు స్థానికులు, బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, సామాజిక సేవ రంగాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు కూడా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
