వాకర్స్ ఆధ్వర్యంలో ఘన సన్మానం..

నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ పట్టణంలోని 9వ వార్డుకు చెందిన శ్రీకాంత్ యాదవ్ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా బుధవారం ఎన్టీఆర్ మినీ స్టేడియం వాకర్స్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ కు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.. అనంతరం కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. తోటి వాకర్సు ప్రేమతో నన్ను సన్మానించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మిని స్టేడియంలో వాకింగ్ ట్రాక్ నిర్మించేందుకు తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. అలాగే ఈ విషయాన్ని కౌన్సిల్ లో ప్రస్తావించి జిల్లా కలెక్టర్ కు విన్నవించి వాకర్స్ కోరికను నెరవేర్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ సన్మాన కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు పుదరి నగేష్, సముందర్ పల్లి రమేష్, కృష్ణ., పడిగల శరత్,. పాల్దే మహేందర్,. అడప నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply