పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

విజయనగరం, ఆగస్టు 29 (ఆంధ్ర ప్రభ): విజయనగరం రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న సంతకాల వంతెన వద్ద శుక్రవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటన కారణంగా, పలు రైలు సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

రద్దయిన రైళ్లలో విజయనగరం నుండి విశాఖపట్నం, విశాఖపట్నం నుండి పలాస, పలాస నుండి విశాఖపట్నం, అలాగే విశాఖపట్నం-కోరాపుట్, కోరాపుట్-విశాఖపట్నం మార్గాల్లో నడిచే రైళ్లు ఉన్నాయి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి అధికారులు చింతిస్తున్నట్లు తెలిపారు.

పట్టాలు తప్పిన రైలు బోగీలను తొలగించి, ట్రాక్‌ను మరమ్మత్తు చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, రైలు సేవలను తిరిగి పునరుద్ధరిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను తెలుసుకోవడానికి రైల్వే హెల్ప్‌లైన్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Leave a Reply