SUPREME | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సాదర వీడ్కోలు
SUPREM | రేణిగుంట, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని నేటి శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగుపయనమైన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (Justice Bhushan Ramakrishna Gavai)కి సాదర వీడ్కోలు లభించింది.
హైకోర్టు రిజిస్టార్ పార్థసారథి, చిత్తూరు ఉమ్మడి జిల్లా జడ్జి అరుణ సారిక, తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి గురునాథ్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు (SP Subbaraidu), ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, తదితరులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్ ఏర్పేడు మండలం మాధవమాల ఉడ్ కార్వింగ్ ఆర్టిజాన్ క్లస్టర్‌లో తయారు చేసిన వేంకటేశ్వర స్వామి ప్రతిమ జ్ఞాపికను అందించారు.

