కనులవిందుగా.. విజయనగరంలో శోభాయాత్ర

విజయనగరం, ఆంధ్రప్రభ: జానపద కళారూపాలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. కదులుతుండగా.. తలపై బోనాలతో ముత్తెదువలు తరలి వస్తుండగా.. పైడితల్లి ఉత్సవ శోభయాత్ర విజయనగరంలో కనుల విందుగా సాగింది. ఆభాల గోపాలం కేరింతలు కొడుతూ ఈ ర్యాలీలో సాగారు. మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, జెండా ఊపి పైడి తల్లి ఆలయం శోభాయాత్రను ప్రారంభించగా.. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సింహాచలం, జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి, జెసి సేధు మాధవన్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు.