ఈజీ మనీ కోసం… లాడ్జిలో చీకటి వ్యాపారం…

  • లాడ్జి యజమానితో సహా ఇద్దరూ అరెస్ట్

అర్మూర్, (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ జిల్లా, అర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల మమత లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారం మేరకు శుక్రవారం పోలీసులు దాడి (Raid) నిర్వహించారు. ఈ దాడిలో ఇద్దరు విటులు, ఇద్దరు మహిళలతో కలిసి వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. లాడ్జి యజమాని అధిక డబ్బులకు ఆశపడి, లాడ్జికి వచ్చే వ్యక్తులకు వ్యభిచారం చేసుకోవడానికి ఉద్దేశపూర్వకంగానే సహకరిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

దీంతో, పోలీసులు ఇద్దరు విటులు, లాడ్జి యజమానిపై కేసు నమోదు చేశారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Leave a Reply