- ఒకరు దుర్మరణం..
- ఆరుగురికి తీవ్రగాయాలు
నంద్యాల , ఆంధ్రప్రభ బ్యూరో : నంద్యాల నుంచి గుద్దలూరు వెళ్లే నల్లమల్ల అడవిలోని ఘాట్ రోడ్ లో శనివారం సాయంత్రం బొలేరో వాహనం బోల్తా పడి ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన షేక్ మజీద్ (46) ఈ ప్రమాదంలో మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు గిద్దలూరు సమీపంలోని కృష్ణం శెట్టిపల్లె, వెంకటాపురం తదితర గ్రామాల్లోని పంట పొలాల్లోని అరటి గెలలు దించి బయటకి తీసుకురావడానికి మహానంది మండలం కూలీలు వెళ్లారు.
పనులు పూర్తి కాగానే గిద్దలూరు నుంచి నంద్యాల వైపు వస్తున్న ఖాళీ గా వస్తున్న బొలెరో వాహనంలో గిద్దలూరు, కృష్ణం శేట్టి పల్లె సమీపంలో దాదాపు 16 మంది ఎక్కారు. నల్లమ ల అటవీ ప్రాంతంలోని ఘాట్ రోడ్ లో దాదా కలందర్ దర్గా సమీపంలోని కల్వర్టును బొలెరో వాహనం ఢీకొట్టి గింగిరాలు తిరిగి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో షేక్ మజీద్ అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహానంది పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

