Mothkur | గృహ జ్యోతి వినియోగదారులకు లేఖల పంపిణీ…

Mothkur | గృహ జ్యోతి వినియోగదారులకు లేఖల పంపిణీ…
Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నదని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ట్రాన్స్కో ఏ ఈ ప్రభాకర్ రెడ్డి కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు విద్యుత్ వినియోగదారులతో విద్యుత్ అధికారులకు ప్రత్యక్ష సంబంధాలు మెరుగు పడాలనే ఉద్దేశ్యంతో వినియోగదారుల ఇంటింటికి వెళ్లి తమ సిబ్బందితో నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో కూడిన సందేశ లేఖలను గృహ జ్యోతి, వ్యవసాయ వినియోగదారులకు అందజేస్తున్నట్లు ఏ ఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట లైన్ మెన్లు, జెఎల్ఎంలు, సిబ్బంది ఉన్నారు.
