ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. దీంతో 11 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఓ దశలో సెన్సెక్స్ 900 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ సైతం 22,400 మార్కుకు చేరువైంది. చివరికి 22,350కు చేరువలో ముగిసింది.
సెన్సెక్స్ ఉదయం 73,005.37 (క్రితం ముగింపు 72,989.93) పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 73,933.80 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 740.30 పాయింట్ల లాభంతో 73,730.23 వద్ద ముగిసింది. నిఫ్టీ 255.80 పాయింట్ల లాభంతో 22,338.45 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ పోర్ట్స్ (5.02%), టాటా స్టీల్ (7.92%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (4.27%), మహీంద్రా అండ్ మహీంద్రా (4.27%), ఎన్టీపీసీ (4.06%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-3.25%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.64%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.25%), జొమాటో (-0.31%), మారుతి (-0.02%).