Yedapally | గ్రంథాలయ ప్రారంభం..

Yedapally | గ్రంథాలయ ప్రారంభం..
Yedapally | ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. యువతలో పుస్తక పఠనం అలవాటు పెంపొందించడం, విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలనే లక్ష్యంతో ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
ఈసందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన నిర్వాహకులు, “యువత దేశ భవిష్యత్తు, వారికి సరైన మార్గదర్శనం అందించడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు, సామాన్య విజ్ఞానం, చరిత్ర, సాహిత్య గ్రంథాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గ్రామ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారం సునీత రెడ్డి, ఎంపీడీఓ కృపాకర్, అరై అన్వేష్, కార్యదర్శి ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి, ప్యాక్స్ మాజీ చైర్మన్ గూడ రాంరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వివేకానంద యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
