CBI | విచారణకు హాజరైన నటుడు విజయ్

CBI | ఢిల్లీ, ఆంధ్రప్రభ : తమిళనాడులోని కరూర్ జిల్లాలో సెప్టెంబరు 27న జరిగిన ఘోర తొక్కిసలాట (Stampede) జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో ఆయనను దిల్లీలోని సీబీఐ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
