Mahesh | బాలీవుడ్ హీరోను రంగంలోకి దింపుతున్న జక్కన్న..?

Mahesh | బాలీవుడ్ హీరోను రంగంలోకి దింపుతున్న జక్కన్న..?

Mahesh | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్ అండ్ గ్లింప్స్ రిలీజ్ (Release) చేసిన తర్వాత సినిమా పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. దీంతో ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్ డేట్ వస్తుందా..? అని సూపర్ స్టార్ (Super Star) ఫ్యాన్స్ మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ హీరోను జక్కన్న రంగంలోకి దింపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఎవరా బాలీవుడ్ హీరో..? ఏంటా క్యారెక్టర్..?

Mahesh

Mahesh | డిఫరెంట్ డిజైన్..

ఈ క్రేజీ మూవీలో గ్లోబల్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె క్యారెక్టర్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందట. అలాగే విలన్ పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రను కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను (Poster) బట్టి తెలుస్తోంది. ఇందులో మహేష్‌ ఫాదర్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ యాక్టర్ నానాపటేకర్ ను తీసుకోవాలి అనుకున్నారు కానీ.. ఎందుకనో కుదరలేదు. ఇప్పుడు ఆ పాత్రను ప్రకాష్ రాజ్ తో చేయిస్తున్నారు. ఇటీవల మహేష్‌, ప్రకాష్‌ రాజ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

Mahesh

Mahesh | నువ్వా – నేనా..?

ఇక అసలు విషయానికి వస్తే.. ఇందులో పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ మరోటి ఉందట. ఆ పాత్ర కోసం బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోను రంగంలోకి దింపుతున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంకా చెప్పాలంటే.. మహేష్‌ పాత్రకు ఏమాత్రం తగ్గకుండా ఈ పాత్ర ఉంటుందట. నువ్వా – నేనా అని పోటీపడేలా ఈ రెండు పాత్రలు ఉంటాయట. ఈ క్యారెక్టర్ ఇచ్చే షాక్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త లీకైనప్పటి నుంచి ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీలో విలన్ పాత్ర చేసే ఆ బాలీవుడ్ స్టార్ హీరో ఎవరు అనేది ఆసక్తిగా మారింది. మరి.. త్వరలో ఆ పవర్ ఫుల్ విలన్ ఎవరో తెలుస్తుందేమో చూడాలి.

Mahesh

CLICK HERE TO READ ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ..

CLICK HERE TO READ MORE

Leave a Reply