CRICKET MATCH | న్యూజిలాండ్ పది ఓవర్లకు 49/0

CRICKET MATCH | న్యూజిలాండ్ పది ఓవర్లకు 49/0
- టాస్ గెలిచిన భారత్
- బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ గిల్
- బ్యాటింగ్ చేస్తున్న కివీస్
CRICKET MATCH | వెబ్‌డెస్క్(స్పోర్ట్స్), ఆంధ్రప్రభ : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి మూడు మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభం అయింది. వడోదరలో తొలి వన్డే ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ (Toss) గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత ప్లేయింగ్ 11లోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. పొట్టలో గాయం కారణంగా కొన్ని నెలలుగా శ్రేయస్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.
మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత (India) జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. 10 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా న్యూజిలాండ్ 49 పరుగులు చేసింది.

ఈ మ్యాచులో భారత స్టార్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లు కాగా.. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు పేసర్లు. ఈ సిరీస్‌కు రిషభ్ పంత్ దూరమయ్యాడు. అతడి స్థానంలో కీపర్ (Keeper) ధ్రువ్ జురెల్ జట్టులోకి వచ్చాడు. 2024లో సొంతగడ్డపై భారత్‌ను న్యూజిలాండ్ వైట్‌వాష్ చేసిన చేసింది. మరోసారి టీమిండియాపై సత్తాచాటాలని కివీస్ భావిస్తోంది. గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా చూస్తోంది.
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్
భారత్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
