Akkineni | విజయవాడలో సందడి చేసిన అఖిల్..

Akkineni | విజయవాడలో సందడి చేసిన అఖిల్..

Akkineni | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అభిమానులు ఎలాంటి స్వార్థం లేకుండా.. తమ హీరో బాగుండాలని తపిస్తుంటారు. అందుకనే.. అభిమానులు అంటే.. హీరోలకు కూడా ప్రత్యేకమైన అభిమానమే. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అయితే.. అభిమానులను, ప్రేక్షకులను దేవుళ్లతో సమానంగా చూస్తుంటారు. అక్కినేని అఖిల్ (Akkineni Akhil) విజయవాడ వెళ్లి సీనియర్ అభిమాని సర్వేశ్వరరావు ఇంట్లో సందడి చేశారు. సర్వేశ్వరరావు గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. అఖిల్.. సర్వేశ్వరరావును కలిసి హెల్త్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమోషనల్ అయ్యారు.

Akkineni

అక్కినేని నాగేశ్వరరావు కాలం నుంచి సర్వేశ్వరరావు అభిమాని. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలతో మంచి అనుబంధం ఉంది. మూడు జనరేషన్లుగా అక్కినేని కుటుంబం పై అభిమానాన్ని చూపిస్తున్న సర్వేశ్వరరావుతో అఖిల్ గడిపిన క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. అఖిల్.. ఇలా అభిమాని ఇంటికి వెళ్లి కలవడం బాగుంది.. అఖిల్ మంచి మనసు తెలుస్తుంది.. అఖిల్ నువ్వు సూపర్ అంటూ సోషల్ మీడియాలో (Media) అభినందిస్తున్నారు.

Akkineni

అఖిల్ సినిమా విషయానికి వస్తే.. లెనిన్ అనే సినిమా చేశాడు. దీనికి మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్టర్. ఇందులో అఖిల్ కు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఇటీవల రిలీజ్ (Release) చేసిన ఫస్ట్ సింగిల్ కు అనూహ్య స్పందన వచ్చింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ విభిన్న ప్రేమకథా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. మే 1న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ లెనిన్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి.. లెనిన్ తో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

CLICK HERE TO READ రాజాసాబ్ మంచి నిర్ణయం

CLICK HERE TO READ MORE

Leave a Reply