వెలగపూడి – ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు వెళ్లనున్నారు. మూడురోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఈ మేరకు చంద్రబాబు షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఢిల్లీలో కేంద్ర పెద్దలతో సీఎం సమావేశం కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీకి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టుల అంశాలపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చిస్తారు.
అనంతరం రాత్రి 8.10 గంటలకు అశోక రోడ్లో ఓ వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. అనంతరం రాత్రి 9.25 గంటలకు ఢిల్లీ నుంచి ఏపీకి తిరుగు ప్రయాణం అవుతారు. రాత్రి 11 గంటలకు విమానంలో విశాఖపట్నానికి చేరుకుంటారు. టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు బస చేస్తారు. రేపు గీతం యూనివర్సిటీలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం గురువారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకుంటారు. 6వ తేదీన ఓ ఆంగ్ల చానల్‌కు సంబంధించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. కాగా, రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 7వ తేదీన జరుగనుంది