12 years old | సమస్యకు చెక్..

12 years old | సమస్యకు చెక్..
- తిరువూరులో రూ ₹1.15 కోట్ల నాబార్డ్ నిధులతో కొత్త డబల్ సీసీ రోడ్డు
- నిర్మాణానికి భూమిపూజ చేసిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
12 years old | తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు పట్టణంలో ఎంఎన్‌కే రోడ్డు నుంచి తోకపల్లి రోడ్డు (బస్టాండ్ – సూర్య రెస్టారెంట్ వరకు) మార్గంలో రాష్ట్రంలోనే అత్యంత దారుణమైన రోడ్డుగా పేరొందిది. దీనిని కొత్తగా డబల్ సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది. ఈ మార్గానికి రూ ₹1 కోటి 15 లక్షల నాబార్డ్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్నారు.

ఈ రహదారి నిర్మాణ పనులను ఈరోజు తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు భూమి పూజ నిర్వహించారు. 12 సంవత్సరాలుగా ఈ రోడ్డు కోసం దీక్షలు, పోరాటాలు చేసిన నాయకులతో కలిసి ఆనంద కేరింతల మధ్య స్టెప్పులు వేస్తూ ఎమ్మెల్యే ప్రారంభించారు. రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
